ప్రాణం కన్నా డ్యూటీయే మిన్న: ఒండినిండా కత్తిపోట్లు.. రక్తం కారుతూనే 15 కిలోమీటర్లు డ్రైవింగ్

శరీరంపై కత్తి గాయమైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అలాంటి వారు కదలడం కూడా కష్టమే.

 Belgian Bus Driver Stabbed Multiple Times Completes Route To Reach Destination-TeluguStop.com

మరి అలాంటిది ఏకంగా పది కత్తిపోట్లు దిగినప్పటికీ ఓ డ్రైవర్ … ప్రయాణికులను క్షేమంగా దించేవరకు రక్తం కారుతున్నా స్టిరింగ్ వదల్లేదు.బెల్జియం దేశానికి చెందిన 58 ఏళ్ల డ్రైవర్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ డీ లిజ్న్‌లో పనిచేస్తున్నాడు.

గురవారం.రోజువారీలానే బస్సులో జనాన్ని ఎక్కించుకుని లైరే టౌన్‌కు వెళ్తున్నాడు.

మార్గమధ్యంలో కొనిచ్చ్ దగ్గర బస్సును ఆపి ఓ దమ్ముకొడుతున్నాడు.సరిగ్గా ఆ సమయంలో ఉన్నట్లుండి ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో డ్రైవర్‌ పొట్ట, కాళ్లు, మెడ సహా పలు చోట్ల పదిసార్లు పొడిచి పారిపోయాడు.

ఎవరైనా అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోవడమో.వెంటనే ఆసుపత్రికి పరిగెత్తడమో చేసేవారు.కానీ ఆ డ్రైవర్ మాత్రం రక్తం కారుతున్నా మళ్లీ బస్సు ఎక్కి.15 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్లెబ్రోక్‌లోని గమ్యస్థానికి ప్రయాణికులను క్షేమంగా చేర్చాడు.దాడి జరిగిన తర్వాత సుమారు గంటపాటు అతను ఏకధాటిగా బస్సును నడుపుతూనే ఉన్నాడు.డిపోకు వచ్చిన తర్వాత తోటి సిబ్బంది అతని గాయాలను చూసి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.విధి నిర్వహణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని అతని వ్యక్తిత్వాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube