చర్మం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు.ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఖర్చు పెట్టి.
రకరకాల క్రీములు, లోషన్లు, ఫేస్ ప్యాకులు వాడుతుంటారు.కానీ, వీటి వల్ల తాత్కాలికంగా మాత్రమే అందంగా కనిపించారు.
కానీ, న్యాచురల్ పద్ధతిలో వెళ్తే.ఎల్లప్పుడు అందంగా మెరిసిపోవచ్చు.
అందులోనూ ఆకు కూరలు ఆరోగ్యానికే కాదు సౌందర్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ఆకుకూరల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బచ్చలి ఆకులను బచ్చలి కూర అని కూడా పిలుస్తుంటారు.
అయితే ఈ బచ్చలి ఆకు చర్మాన్ని యవ్వనంగా మెరిపించడంలోనూ, మచ్చలను, ముడతలను దూరం చేయడంలోనూ సూపర్‌గా సహాయపడుతుంది.మరి బచ్చలి ఆకులను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బచ్చలి ఆకులను శుభ్రంగా క్లీన్ చేసుకుని మిక్స్ వేసి పేస్ట్ చేయాలి.ఆ పేస్ట్‌లో కొద్దిగా పసుపు, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.
అరగంట పాటు ఆరనిచ్చి అనంతరం చల్లటి వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తే.ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా, కాంతివంతంగా మెరుస్తుంది.
ఇక రెండొవది.బచ్చలి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఆ పొడిలో కొద్దిగా తేనె వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి.
ఇరవై లేదా ముప్పు నిమిషాల పాటు వదిలేపి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై మృత కణాలు, మలినాలు పోయి అందంగా మారుతుంది.
బచ్చలి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కాబట్టి, కొన్ని బచ్చలి ఆకులను మెత్తగా నూరి రసం తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి దూది సాయంతో ముఖానికి అద్దాలి.
పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి ఇలా తరచూ చేస్తే నల్ల మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి.
.