ప‌క్షుల ఆహారం కోసం ఒక ఎలుగుబంటి చేసిన పని...!

సాధారణంగా పక్షులకు ఆహారం పెట్టాలి అంటే పెద్ద ప్లేట్ లో లేక ధాన్యపు గింజలను నేల మీద పెడితే అవి వచ్చి తిని వెళ్లిపోయేది.కానీ ప్రస్తుత రోజులలో వాటి కోసం ఏకంగా చెట్టుపైకి ఆహారాన్ని అందజేస్తున్నారు.

 The Work Of A Bear To Feed The Birds , Bear, Feeding Birds,social Media,viral Po-TeluguStop.com

బోర్డు ఫీడర్ ను ఉపయోగించి పక్షి కి సరిపడా ఆహారాన్ని ఉంచడం జరుగుతుంది.అలాగే పెంపుడు జంతువులను పక్షులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మరి ఆహారాన్ని పెడతారు.

మరి ఎలుగుబంట్లను ఎవరు, ఎలా చూసుకుంటారు అని ఎవరికైనా సందేహం వచ్చిందా… ఐతే ఒక ఎలుగుబంటి ఆహారం కోసం చెట్టుపై పక్షుల కోసం పెట్టిన ఆహారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది.

చెట్టు మీద ఉన్న ఫీడర్ కావాలంటే చెట్టు కచ్చితంగా ఎక్కాల్సిందే.

త్వర త్వరగా చెట్టు ఎక్కేసి ఆహారం తీసుకునే సమయానికి స్కాట్ బిక్స్బీ అనే ఒక వ్యక్తి వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది.అతను నివసిస్తున్న బిల్డింగ్ పక్కనే ఉన్న చెట్టు ఎక్కడ ఉందో ఒక్కసారిగా అతడు ఎలుగుబంటిని చూసి భయపడిపోయాడు.

బేర్ డౌన్ డౌన్ అంటూ అరవడం మొదలు పెట్టాడు.అయినా కూడా ఎలుగుబంటి భయపడకుండా తన ప్రయత్నం తాను చేసింది.

ఇక ఆ వ్యక్తి గట్టిగా అరవడంతో ఎలుగుబంటి చెట్టు మీద నుంచి కిందకు వచ్చేసింది.ఈ క్రమంలోనే అతను పెంచుకుంటున్న కుక్క పిల్లలు ఎలా అయితే ట్రీట్ చేసాడో అచ్చం అలాగే ఎలుగుబంటిని కూడా చూసుకోవడం జరిగింది.

ఇక ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా చేసుకొని అతను షేర్ చేయడం జరిగింది.అతను ట్వీట్ చేస్తూ… ” పక్షుల ఆహారాన్ని ఎలుగుబంట్లు తినకుండా ఉండేందుకు ఏమైనా టిప్స్ ఉన్నాయా ” అంటూ వీటిలో తెలియజేయడం జరిగింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube