అల్లరోడి సినిమాకు ఆదరణే లేదుగా!

‘అల్లరి’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమైన అల్లరి నరేష్, కామెడీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్నేళ్ల పాటు తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు.కానీ ఒకేరకమైన కామెడీ సినిమాలతో వస్తుండటంతో అల్లరి నరేష్ కొన్నాళ్లకు ఫేడవుట్ అయ్యాడు.

 Allari Naresh Movie Has No Buzz For Ott Too, Allari Naresh, Naandhi, Ott, Tollyw-TeluguStop.com

ఇప్పుడు హీరోగా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో క్యారెక్టర్ పాత్రలకు సైతం ఓకే అంటున్నాడు.మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించిన అల్లరి నరేష్, ఇప్పుడు తాజాగా ఓ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు.

‘నాంది’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరో పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై కాస్త బజ్ క్రియేట్ అయ్యింది.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు చూశారు.

కానీ రిలీజ్ విషయంలో చాలా ఆలస్యం అవుతుందడటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గిపోయింది.దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే అక్కడ కూడా వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది.అల్లరి నరేష్ చిత్రాలకు ఓటీటీలో పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఈ సినిమాకు చాలా తక్కువ ఆఫర్లు ఇస్తున్నారట.

దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో చిత్ర యూనిట్ పడిపోయింది.మరి నాంది చిత్రం అసలు రిలీజ్‌కు నోచుకుంటుందా లేదా అనేది అనుమానంగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube