పాము నీరు తాగడం ఎప్పుడైనా చూశారా..??

మన దేశంలో ఒక విష జంతువును దేవతగా కొలుస్తారు.పూజలు చేస్తారు, ఆ జంతువు పగ పడుతుందా అని నమ్ముతారు.

 Snake Drinking Water,snake,water, Viral Video, Social Media-TeluguStop.com

అదేవిధంగా అదే జంతువును మరో దేశంలో చాలా ఇష్టంగా అనేక రకాలుగా వండుకొని తింటారు.అది ఏంటి అని ఆలోచిస్తున్నారా .అదేనండి పాము… సర్పాల లో విష రహిత సర్పాలు, విష సర్పాలు ఇందులో చాలా రకాలు ఉన్నాయి.ఇప్పటికీ వీటి మీద సరైన అవగాహన ఎవ్వరికీ లేదు.

గ్రామాల స్థాయిలో వాటిని పూజిస్తారు, అదే గ్రామాల నుంచి బయటకు వచ్చి కనిపిస్తే ప్రాణభయంతో చంపేస్తారు.కొంతమంది పాములు పగపడతాయని, అవి పాలు తాగుతా యని , వాటికి చెవులు ఉంటాయని అంటారు.

కానీ వాటి గురించి సరైన అవగాహన కల్పించే విధంగా ఎటువంటి ఆధారాలు లేవు.

ఇప్పటివరకు సినిమాల్లో తప్ప బయట పాములు నీళ్లు తాగడం ఎవరైనా చూశారా ? ఈ ప్రశ్నకు సమాధానం లేదు అనే ఎక్కువ శాతం వస్తుంది.కానీ ఇప్పుడు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది.ఏమిటా వీడియో అనుకుంటున్నారా.ఒక పాము నీళ్లు తాగుతున్న వీడియో.దీన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసింది ఎవరో కాదు ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద .ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఓ పాము మనిషి అరిచేతుల్లో నుంచి ఉన్న నీటిని నాలుకు తో తాగడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది.

కానీ ఆ విధంగా పాము నీళ్లు తాగడానికి వీళ్లు అవ్వక.రెండు దవడల పై ప్రతికూల ఒత్తిడిని కలిగించి దాని ద్వారా వచ్చిన ఒత్తిడి ద్వారా నీటిని తీసుకుంటుంది.

ఆతర్వాత సానుకూల ఒత్తిడిని ప్రయోగించి నీటిని లోపలికి తీసుకుంటుంది.వెంటనే నోటి నుంచి వచ్చిన నీటిని శరీరం లోపలకి పంపిస్తుంది.ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఆ వీడియోను అధికారి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube