కేవలం ఈ రెండు పదార్థాలతో పగిలిన పాదాలకు బై బై చెప్పండి!

పాదాల పగుళ్లు.( Cracked Feet ) స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.

 Just These Two Ingredients Helps To Reduce Cracked Feet Details! Cracked Feet, C-TeluguStop.com

చాలా మంది వింటర్ సీజన్ లోనే ఎక్కువగా ఈ సమస్యకు గురవుతుంటారు.కానీ కొందరు మాత్రం సీజన్ తో పని లేకుండా తరచూ పాదాల పగుళ్లతో తీవ్రంగా మదన పడుతుంటారు.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్లో లభ్యమయ్యే క్రీమ్ లను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం కనిపించకపోతే ఏం చేయాలో తెలియక మదన పడుతుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే వర్రీ వద్దు.కేవలం రెండు పదార్థాలతోనే పగిలిన పాదాలకు బై బై చెప్పవచ్చు.మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.వాటిని ఎలా ఉపయోగించి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నూనె.( Coconut Oil ) దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది.

కొబ్బరి నూనె జుట్టు సంరక్షణకు, చ‌ర్మ‌ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది.పాదాల పగుళ్లను నివారించే సామర్థ్యం సైతం కొబ్బరి నూనెకు ఉంది.

Telugu Aloe Vera Gel, Coconut Oil, Cracked Feet, Crackedfeet, Tips, Latest-Telug

అలాగే మరొకటి అలోవెరా జెల్.( Aloevera ) పాదాల పగుళ్లను చాలా త్వరగా నయం చేయడానికి అలోవెరా జెల్ అద్భుతంగా సహాయపడుతుంది.పాదాలను మృదువుగా కోమలంగా మారుస్తుంది.ఇక ఈ రెండు పదార్థాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసి స్పూన్‌ సహాయంతో కనీసం ఐదు నిమిషాల పాటు ఆగకుండా బాగా మిక్స్ చేయాలి.

Telugu Aloe Vera Gel, Coconut Oil, Cracked Feet, Crackedfeet, Tips, Latest-Telug

తద్వారా ఒక స్మూత్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఇప్పుడు ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు పాదాలను వాటర్ తో వాష్ చేసి.తడి లేకుండా తుడుచుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను పాదాలకు అప్లై చేసి కనీసం 10 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను వాడితే కొద్ది రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయం అవుతాయి.

పాదాలు మృదువుగా, కోమలంగా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube