అమ్మని మించిన దైవం లేదని అంటారు.అమ్మ కోసం కొడుకు ఎంత ఘాతుకానికైనా పాల్పడతాడు.
అమ్మని పల్లెత్తి మాట ఎవరన్నా అన్నగాని సహించని కొడుకులని చూసాము.కానీ ఈ ప్రబుద్దుడు మాత్రం తన గురువును జైలు శిక్ష నుంచి కాపాడటం కోసం తన కన్న తల్లినే చంపేశాడు.
అవును మీరు విన్నది నిజమే.అసలు వివరాలలోకి వెళితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది.
విశాల్ అనే 22 ఏళ్ల యువకుడు.ఓ పాఠశాలలో పార్ట్ నర్ గా ఉన్నాడు.
విశాల్ తోపాటు వినయ్ అనే మరో యువకుడు కూడా పార్ట్ నర్.అయితే విశాల్, వినయ్ మధ్య ఒకరోజు ఒక గొడవ అయిందట.
అది చిలికి చిలికి గాలి వాన అయినట్లు వినయ్ ప్రాణాలను బలితీసుకుంది.అయితే ఈ కేసులో విశాల్ తో పాటు ఆ పాఠశాల హెడ్ బ్రజేశ్ శర్మను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఆరు నెలల క్రితం విశాల్ బెయిల్ పై విడుదల అయ్యాడు.అయితే తన గురువును ఈ కేసు నుంచి కాపాడేందుకు ప్లాన్ చేశాడు.తనకు ప్రాణం పోసిన తల్లినే చంపి.బ్రజేష్ ప్రత్యర్థులపై ఈ నింద మోపుదామని భావించాడు.
దీంతో ఇరు వర్గాలు కాంప్రమైజ్ కు వచ్చేసి.రెండు కేసులు కొట్టేసే అవకాశం ఉంటుందని విశాల్ భావించాడు.కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తేలుస్తుంది అన్నట్లు జరిగింది.సీన్ చూస్తే తల్లిని తుపాకీతో కాల్చి చంపాడు.
ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అమ్మను చంపేశారని పోలీసుల ఎదుట నమ్మబలికాడు.కానీ పోలీసులకు అనుమానం రావడంతో బాగా విచారించారు.
ఎట్టకేలకు చేసిన ఘాతుకాన్ని బయటపెట్టాడు.అమ్మను చంపానని నేరాన్ని అంగీకరించాడు.
నిందితుడిని రిమాండ్ కు తరలించారు.