బి అలర్ట్: ఈ యాప్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే తీసేయండి.. ఎందుకంటే..?!

ఈ మధ్య ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇన్‌స్టంట్ లోన్ కావాలా.మీ లోన్ అప్రూవ్ అయింది.

 Be Alert If This App Is On Your Phone Remove It Immediately Because, Application-TeluguStop.com

ఇంకా ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే చాలు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అనే మెసేజ్ లు, యాడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి.ఈ యాప్స్ ను నమ్మి చాలా మంది డబ్బులు కూడా పోగొట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో గూగుల్ ఇప్పటికే 100కు పైగా అలాంటి ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది.

కానీ ఇంకా కొన్ని యాప్‌లు మాత్రం ఇంకా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఒక ఫేక్ అప్ గుట్టు రట్టు చేసారు పోలీసులు.దానితో వెంటనే ఆ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించారు.

ప్రధాన మంత్రి యోజన లోన్ అనే యాప్ ద్వారా లోన్ ఇస్తాము అని, అందులో భాగంగా వినియోగదారులు వాళ్ళ పాన్‌, ఆధార్‌, మొబైల్ నంబర్‌, బ్యాంకు ఖాతా నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయమని అడుగుతారు.ఆ తరువాత ఆ డేటా మొత్తాన్ని హ్యాకర్లకు చేరవేస్తారని గుర్తించారు పోలీసులు.

Telugu Cyber, Cyber Security, Fraud App, Instant Loan, Store, Pradhanamantri, Re

ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ యాప్‌కు చెందిన వెబ్‌సైట్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం.ఆ వెబ్సైటు ఓపెన్ చేస్తే కూడా అందులో ప్రజలకు చెందిన సమాచారాన్ని సేకరించి దాన్ని కూడా హ్యాకర్లకు చేరవేస్తారు.కానీ వాళ్ళు చెప్పినట్లు లోన్ మాత్రం ఇవ్వరు.ఈ విషయాన్నీ తెలుసుకున్న సైబర్ పీస్ ఫౌండేషన్ అనే సంస్థ పైన తెలిపిన యాప్ యొక్క మోసాన్ని బయటపెట్టడంతో గూగుల్ నుంచి ఆ యాప్‌ను తొలగించారు.

ఇలాంటి యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube