సంగీతాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు బప్పి లహరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వందల సంఖ్యలో సినిమాలకు బప్పి లహరి సంగీతం అందించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీకి డిస్కో మ్యూజిక్ ను పరిచయం చేసి బప్పి లహరి డిస్కో కింగ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించు కున్నారు.తన ఆహార్యం ద్వారా కూడా బప్పి లహరి వార్తల్లో నిలిచారు.
ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే బప్పి లహరి స్టైల్ ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.
బప్పి లహరి మరణం అభిమానులను ఎంత గానో బాధ పెడుతోంది.
పలువురు సినీ ప్రముఖులు బప్పి లహరితో ఉన్న అను బంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచు కుంటున్నారు.ధన త్రయోదశి రోజున బప్పి లహరి బంగారాన్ని కొనుగోలు చేసేవారు.
బప్పి లహరికి గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది.కొన్నేళ్ల క్రితం బప్పి లహరి ఎన్నికల్లో పోటీ చేయగా ఆ సమయానికి ఆయన దగ్గర 754 గ్రాముల బంగారం, ఆయన సతీమణి దగ్గర 967 గ్రాముల బంగారం ఉండేది.
గతంలో బంగారం ధరించడం గురించి బప్పి లహరి చెబుతూ తాను గోల్డ్ ఈజ్ మై గాడ్ అని నమ్ముతానని చిన్నప్పటి నుంచి తనకు మ్యూజిక్ పై ఆసక్తి అని బప్పి లహరి తెలిపారు.అమెరికన్ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీని చూసి ఆయనలా బంగారం తెచ్చుకోవాలని తాను అనుకున్నానని అమ్మ గోల్డ్ చెయిన్ ఇచ్చిన ఆల్బమ్ హిట్టైందని ఆ తర్వాత అమ్మ మరో గోల్డ్ చెయిన్ ఇవ్వగా నాకు మ్యారేజ్ అయిందని బప్పి లహరి చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత ప్రతిసారి గోల్డ్ కొనుగోలు చేయడం అలవాటుగా మారిందని బప్పి లహరి అన్నారు.గోల్డ్ లేక పోతే సామాన్య ప్రజలు తనను గుర్తు పట్టలేరని పబ్లిక్ లోకి వెళ్లిన సమయంలో గోల్డ్ తన శరీరంపై ఉండాల్సిందేనని బప్పి లహరి తెలిపారు.
చాలా సంవత్సరాల క్రితం బప్పి లహరి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.