బండ్ల గణేష్ భీమ్లా మిస్ అయిన ఇక్కడ మిస్ అవ్వడట.. కలుద్దాం అంటూ ట్వీట్..

చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ మరొక హీరోకు లేదు అంటే అతియసోక్తి కాదేమో.ఆయన చేసే సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా పవన్ రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గదు.

 Bandla Ganesh Attending Pawan Kalyan Meeting, Pawan Kalyan, Bandla Ganesh, Pawan-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.పవన్ కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ఆయనను అమితంగా పూజించే భక్తులు చాలా మంది ఉన్నారు.

అందులో బండ్ల గణేష్ ముందు ఉంటారు.

బండ్ల గణేష్ స్పీచ్ కోసం పవన్ అభిమానులు సైతం ఎదురు చూస్తూ ఉంటారు.

పవన్ ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ వెళ్లి తన భక్తిభావం చూపిస్తాడు.అయితే భీమ్లా నాయక్ ఈవెంట్ కు హాజరు కాలేదు.

దీంతో ఫ్యాన్స్ కొద్దిగా నిరాశ చెందారు.అయితే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.

ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ లో బండ్ల స్పీచ్ ని మిస్ అయిన వారికీ ఈసారి మాత్రం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు బండ్ల.ఈయన తాజాగా ఒక పోస్ట్ పెట్టాడు.అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మాత్రం పవన్ మీటింగ్ లో కనిపిస్తాను అని కన్ఫర్మ్ చేసి మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని ఆయన అభిమానులతో పాటు పవన్ అభిమానుల్లో కూడా నింపాడు.ఆయన పోస్ట్ చేస్తూ.”వీరులారా ధీరులారా,జన సేన సైనికులారా !! రండి కదలి రండి కడలి అలగా తరలి రండి.నేను కూడా వస్తున్నాను.మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం, తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం, అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం.

కలిసి పోరాడదాం⁦” అంటూ ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.ఈ నెల 14న పవన్ తన పార్టీ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ మీటింగ్ కి తాను కూడా వస్తున్నట్టు తెలిపాడు.

మరి ఈ మీటింగ్ లో ఆయన స్పీచ్ ఉంటుందా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

https://twitter.com/ganeshbandla/status/1502844693821808641?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1502844693821808641%7Ctwgr%5Ehb_1_8%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-4289200241610478124.ampproject.net%2F2202230359001%2Fframe.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube