సముద్రగర్భంలో నివసించే జీవులను చూస్తే మతిపోవాల్సిందే.వీటిని చూస్తే నిజంగా మన భూప్రపంచంపై ఇలాంటి జీవులు ఉన్నాయా అని ఆశ్చర్యపోకతప్పదు.
నీటి అడుగున ఆవు లాంటి జంతువులు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే.ఎందుకంటే ఇవి నిజంగానే ఉన్నాయి.
వాటికి సంబంధించిన వీడియోని తాజాగా యానిమల్ ప్లానెట్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే ఒక లక్షకు పైగా వచ్చాయి.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తోంది.
ఈ జీవులు సముద్ర నేలపై మొలిచిన మొక్కలను ఆవుల వలె తినే శాఖాహారులు.
ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు వావ్ అని నోరెళ్లబెడుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో భారీ కాయంతో ఉన్న ఒక జలచరాన్ని చూడొచ్చు.
ఇది సముద్రపు నేలపై మొలిచిన మొక్కలను చాలా ఫాస్ట్ గా తింటుంది.దీని బరువు దాదాపు 400 కిలోల వరకు ఉంటుంది.
శాకాహార సముద్ర క్షీరదాలైన వీటిని శాస్త్రవేత్తలు మనాటీలు అని, కొన్నిసార్లు సముద్రపు ఆవులు అని పిలుస్తారు. ఇవి ఏనుగుల జాతికి కూడా చెందినవి అని చెబుతుంటారు.
అయితే సముద్ర గర్భంలో మొక్కలు తగినంత లేక ఇవి ఆకలితో అలమటిస్తున్నాయి.అలా ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరిపోయాయి.
వీటి ప్రధాన ఆహారం మొక్కలు.ఇవి పెద్దగా ఉన్నప్పటికీ 30 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు.
650 కిలోల వరకు బరువు పెరిగే ఇవి రోజుకి వంద కిలోలకు పైగా సముద్రపు మొక్కలు తింటాయి.ఈ జాతి జీవులు అమెజాన్ బేసిన్, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, పెరూలలో మంచినీటిలో మాత్రమే కనిపిస్తాయి.
ఈ జీవులు 20 నిమిషాల పాటు నీటిలో గాలి పీల్చకుండా ఉండగలవు.ఈ అద్భుతమైన వీడియో పైన మీరు కూడా ఒక లుక్కేయండి.







