ఒక పక్క నటుడిగా సినిమాల్లో కొనసాగుతూనే మరో పక్క రాజకీయ నాయకుడిగా ఎమ్యెల్యేగా రెండు పడవల మీద కన్నేసిన నందమూరి బాలకృష్ణ వీటితో సరిపెట్టుకోకుండా ఏకంగా సీఎం సీటు మీద కన్నేసినట్టు ఇప్పుడు వార్తలు బయలుదేరాయి.ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య ఫోకస్ అంతా సీఎం సీటు మీదే ఉందని సమాచారం.
ప్రస్తుతానికి బావ, వియ్యంకుడు అయిన చంద్రబాబు సీఎంగా ఉన్నా.తనకైతే కొన్ని నెలలు అయినా ఆ పదవి కావాలనేది బాలయ్య కోరిక అని సమాచారం.వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడినా గెల్చినా చంద్రబాబు జాతీయ రాజకీయాల వైపు వెళ్లిపోవాలని.తనకు మున్ముందు ఆ పీఠాన్ని అప్పగించాలని బాలయ్య అంటున్నాడట.అల్లుడు లోకేష్ రేసులో ఉన్నా.తను సీఎం అయిన తర్వాతే లోకేష్ కు ఛాన్స్ అనేది బాలయ్య వాదనగా తెలుస్తోంది.
బాబు తర్వాత తనే టీడీపీ తరఫున ముఖ్యమంత్రి కావాలని, ఆ తర్వాత లోకేష్ కు ఛాన్స్ అని తన సన్నిహితుల దగ్గర బాలయ్య చెప్పుకుంటున్నాడట.