బాలయ్య 'అఖండ' ఫైనల్‌ రిపోర్ట్‌ వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ సుదీర్ఘ కాలం తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్నాడు.విజయాలను దక్కించుకుని పుష్కర కాలం  పైగానే  అయ్యింది.

 Balakrishna Akhanda Movie Final Collections , Balakrishna , Akhanda , Hit Movi-TeluguStop.com

ఆయన పనైపోయింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అఖండ వచ్చింది.సినిమా టైటిల్ కు తగ్గట్లుగా సినిమా వచ్చింది.

ఏమాత్రం తగ్గకుండా ఆహా అనేట్లుగా అఖండ సినిమా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.అద్బుతమైన అఖండ సినిమాకు అంతకు మించిన వసూళ్లు నమోదు అయ్యాయి.

కేవలం నాలుగు రోజుల్లో సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుంది.ఇప్పుడు అఖండ సినిమా బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతుంది.

మూడవ వారంలో కూడా చాలా థియేటర్లలో 70 శాతంకు పైగా ఆక్యుపెన్సీ నమోదు అవ్వడం జరుగుతుంది.ఇది ఒక అద్బుతమైన విజయం అన్నట్లుగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా వసూళ్లు ఈ వారంతో క్లోజ్ అవ్వబోతున్నాయి.

కనుక సినిమా ఫైనల్‌ రిపోర్ట్‌ ఏంటి అంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు ఖరారు చేస్తారు.

వారు చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌.బాలయ్య మరియు బోయపాటి కాంబోలో గతంలో వచ్చిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు హిట్‌.

సూపర్ హిట్‌ కాగా ఈ మూడవ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ గా నిలిచి వారికి హ్యాట్రిక్ ను ఇవ్వడం జరిగింది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu-Latest News - Telugu

వీరి కాంబోలో మరిన్ని సినిమాలను అభిమానులు కోరుకుంటున్నారు.ప్రతి ఒక్క సినిమా కూడా వీరి కాంబో పై మరింత అంచనాలు పెంచుతూనే ఉన్నాయి.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఆ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.బాలయ్య బ్యాక్ టు బ్యాక్ 2022 లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube