వైష్ణవి చైతన్యకు తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. రాఖీ గిఫ్ట్ మామూలుగా లేదంటూ?

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా అక్క తమ్ముళ్లు, అన్నా చెల్లెలు ఈ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.

 Baby Actress Vaishnavi Chaitanya Got Special Gift Brother, Baby Actress, Vaishna-TeluguStop.com

రాఖీ పండగ వచ్చింది అంటే చాలు ఎంత దూరంలో ఉన్నా కూడా సరే, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకచోటకు చేరాల్సిందే.రాఖీ కట్టి తీరాల్సిందే.

ఎంతో ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి అన్న తమ్ముడు తనకు తోచినంతలో ఎంతో కొంత డబ్బో లేదంటే ఏదైనా బహుమతో ఇస్తాడు.అలా తనకు కూడా తమ్ముడు మర్చిపోలేని బహుమతి ఇచ్చాడని అంటోంది వైష్ణవి చైతన్య.

Telugu Baby Actress, Gift Brother, Tattoo, Tollywood-Movie

అయితే ఆ గిఫ్ట్‌ రాఖీ పండగకు కాకుండా తన బర్త్‌డేకి ఇచ్చాడంది.కానీ, ప్రతి రాఖీ పండగకు అదే గిఫ్ట్‌ చూపిస్తున్నాడంటోంది.ఇంతకీ ఆ బహుమతి మరేంటో కాదు పచ్చబొట్టు.ఈ సందర్బంగా వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) మాట్లాడుతూ.నా బర్త్‌డేకి గుర్తుండిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నాడు.అలా తన ఎడమచేతిపై వైషు అని పచ్చబొట్టు వేయించుకున్నాడు.

అది నిజమైన టాటూ అనుకోలేదు, జోక్‌ చేస్తున్నాడనుకున్నాను.కానీ తర్వాత అది నిజమైన టాటూనే అని అర్థమైంది.

ఈ పచ్చబొట్టు వేయించుకోవడానికి మూడు గంటలు పట్టిందట!.

Telugu Baby Actress, Gift Brother, Tattoo, Tollywood-Movie

చాలా ఎమోషనల్‌ అయిపోయాను, ఏడ్చేశాను.అప్పటి నుంచి రాఖీ కట్టిన ప్రతిసారి పచ్చబొట్టు చూపిస్తున్నాడు అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.వైష్ణవి చైతన్య విషయానికి వస్తే.

ఈమె ఇటీవల విడుదల అయినా బేబీ( Baby ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ ని రాబట్టంతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.

కలెక్షన్ల సునామీని సృష్టించింది.ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube