సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్( Babu Mohan ) బిజెపికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.తాజాగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన బాబు మోహన్ అసలు తాను ఎందుకు బిజెపికి( BJP ) రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు.” నన్ను బిజెపిలో అవమానిస్తున్నారు.నా ఫోన్ కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు.
తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు.రేపు రాజీనామా లేఖను పంపుతాను.
భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా( Warangal Parliament Seat ) పోటీ చేస్తా ‘ అంటూ బాబు మోహన్ వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారంటూ బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి కోసం తాను చాలా కష్టపడ్డాను అని, తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసానని, ఏ,బి,సి,డి సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరీలో పెట్టారంటూ బాబు మోహన్ ఆవేదన చెందారు.నన్ను అవమానించడానికి రాష్ట్ర బిజెపి పెద్దలు నిర్ణయించుకున్నారనే విషయం తనకు అర్థమైందని బాబు మోహన్ అన్నారు.
![Telugu Babu Mohan Bjp, Babu Mohan, Mla Babu Modhan, Telangana Bjp, Telangana-Pol Telugu Babu Mohan Bjp, Babu Mohan, Mla Babu Modhan, Telangana Bjp, Telangana-Pol](https://telugustop.com/wp-content/uploads/2024/02/babu-mohan-resigned-from-bjp-ahead-of-loksabha-polls-detailsa.jpg)
వాస్తవంగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు( Telangana Assembly Elections ) ముందే బాబు మోహన్ బిజెపి లో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆవేదనకు గురయ్యారు.టికెట్ ఆయనకు దక్కే అవకాశం లేదన్నట్లుగా ప్రచారం సైతం అప్పుడు జరిగింది .చిట్ట చివరికి ఆయనకు బిజెపి టికెట్ దక్కినా ఎన్నికల్లో ఓటమి చెందారు.ఆందోల్ నియోజకవర్గం( Andole Constituency ) నుంచి బాబు మోహన్ పోటీ చేయగా.
కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
![Telugu Babu Mohan Bjp, Babu Mohan, Mla Babu Modhan, Telangana Bjp, Telangana-Pol Telugu Babu Mohan Bjp, Babu Mohan, Mla Babu Modhan, Telangana Bjp, Telangana-Pol](https://telugustop.com/wp-content/uploads/2024/02/babu-mohan-resigned-from-bjp-ahead-of-loksabha-polls-detailsd.jpg)
బాబు మోహన్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.అయితే తెలంగాణలో బిజెపి పుంజుకునే అవకాశం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా తనకు టికెట్ ఇచ్చే ఛాన్స్ తక్కువగా ఉందనే సంకేతాలతో బాబు మోహన్ పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఆ కారణంతోనే బిజెపికి రాజీనామా చేసిన ఆయన .తనకు ఎంపీ టికెట్ ఇచ్చే పార్టీలో చేరే ఆలోచనతో ఉన్నారు.ఈ మేరకు మరికొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలో చేరిపోతున్నారనేది క్లారిటీ ఇవ్వనున్నారు.