శానిటైజర్ ను వాడినందుకు వేటు వేశారు

కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.కరోనా పై విజయం సాధించాలంటే ప్రజలు సహకరించాలని పిలుపునిస్తున్నాయి.

 Australian Pacer Suspended After Applying Hand Sanitizer To Ball, Hand Sanitizer-TeluguStop.com

అందులో భాగంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నప్పుడు మాస్క్ లు తప్పనిసరిగా ధరించవల్సిందిగా అలాగే ఎప్పుడు శానిటైజర్‌ ను తమ దగ్గర ఉంచుకోవలసిందిగా సూచిస్తుంది.దీన్ని ఓ ఇంగ్లీష్ క్రికెటర్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు.

అందుకే ఆ క్రికెటర్ తనతో పాటు తను బౌల్ చేసే బాల్ కు కూడా దాన్ని అప్లై చేసాడు.ఇది గుర్తించిన క్రికెట్ నిపుణులు తన పై సీరియస్ అయ్యారు.

వివరాలలోకి వెళ్తే

కరోనా ప్రభావం కారణంగా బంతికి ఎటువంటి పదార్థాలను రాయకూడదనే రూల్ ను తాజాగా (ఐసీసీ) ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఇంగ్లండ్‌ కౌంటీ ప్లేయర్‌ మిచ్‌ క్లేడన్‌ సస్సెక్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

గత నెలలో జరిగిన ఒక మ్యాచ్‌లో అతడు స్వింగ్ రాబట్టడం కోసం బంతికి శానిటైజర్‌ను పూసి బౌలింగ్‌ చేశాడు.దీని ఫలితంగా అతనికి మూడు వికెట్లు లభించాయి.

ఈ తంతును గుర్తించిన సస్సెక్స్‌ జట్టు ప్రతినిధులు వెంటనే అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం ఈ అంశం పై ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విచారణను చేపట్టాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube