బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ టైటిల్ విన్నర్ అయ్యాక సినిమా హీరోగా కూడా చేస్తున్నాడు.అసలైతే బిగ్ బాస్ కి వెళ్లకముందే సకలగుణాభిరామ సినిమా చేశాడు సన్నీ.
ఆ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.బిగ్ బాస్ నుంచి రాగానే అప్పుడు రిలీజ్ చేస్తే ఏమైనా క్రేజ్ ఉండేదేమో కానీ దాదాపు ఏడాది తర్వాత సన్నీ సినిమా రిలీజ్ అవుతుంది.
అయితే ఈ సినిమాకు ప్రమోషన్స్ చేస్తున్నా సరే ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు.
బిగ్ బాస్ తర్వాత సన్నీ క్రేజ్ కొంతవరకు కొనసాగించినా సినిమా హీరోగా అంటే మాత్రం అతన్ని పట్టించుకోవట్లేదు.
బిగ్ బాస్ క్రేజ్ తన సినిమాకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని సన్నీ కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో అన్నాడు.అయితే బిగ్ బాస్ వల్లే సన్నీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
మరి సినిమా ఓపెనింగ్స్ బాగా రాకపోయినా సరే సినిమా రిలీజ్ అయ్యాక మౌత్ టాక్ తో అయినా సినిమా సక్సెస్ అవుతుందేమో చూడాలి.బిగ్ బాస్ సన్నీ ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ఏ.టి.ఎం వెబ్ సీరీస్ చేస్తున్నాడు.ఇదే కాకుండా అన్ స్టాపబుల్ అంటూ సప్తగిరితో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.