సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జ్యోతి థియేటర్ పై ప్రభాస్ అభిమానులు దాడికి పాల్పడ్డారు.సినీ నటుడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఆలస్యంగా ప్రారంభించారని థియేటర్ అద్దాలను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.
ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం 7 గంటలకు ప్రారంభించారు థియేటర్ నిర్వాహకులు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు థియేటర్ పై దాడికి పాల్పడ్డారు.