రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి( Astrologer Venu Swamy ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తరచూ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
అయితే కొంతమంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినట్టే జరగడంతో చాలామంది ఆయనను గట్టిగా నమ్ముతున్నారు.ముఖ్యంగా సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు వ్యవహారం సమయంలో ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారు మోగిపోయిన విషయం తెలిసిందే.
ఇక అప్పటినుంచి ఈయన బాగా పాపులర్ అయ్యారు.
ఇక ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు.ఇది ఇలా ఉంటే ఈ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఒక సినిమాలో నటించాడని మీకు తెలుసా.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇంతకీ వేణు స్వామి ఏ సినిమాలో నటించాడు? ఎటువంటి పాత్రలో నటించాడు అన్న వివరాల్లోకి వెళితే.తాజాగా ఆయన నటించిన సినిమాకి సంబంధించిన ఒక క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వేణు స్వామి జగపతిబాబు హీరోగా నటించిన జగపతి( Jagapathi ) అనే సినిమాలో అర్చక స్వామి పాత్రలో నటించాడు.
అందులో హీరోయిన్ రక్షిత జగపతి బాబు కాంబినేషన్ లో వేణు స్వామి కనిపించారు.ఆయనకి రెండు డైలాగులు కూడా ఉన్నాయి.అంతే కాదండోయ్ త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అతడు( Athadu Movie )లో కూడా వేణు స్వామి ఉన్నారట.
ఒక సాంగ్ లో ఆయన ఉన్నారని తెలుస్తోంది.ఈ వార్త తెలిసే చాలామంది నిజమా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే మొన్నటి వరకు వేణు స్వామి పై ప్రభాస్ అభిమానులు నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ మండిపడిన విషయం తెలిసిందే.సలార్ సినిమా( Salaar ) గురించి ప్రభాస్ కెరియర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రభాస్ అభిమానులు సలాడ్ సినిమా విడుదల తర్వాత నెగిటివ్ కామెంట్ తో రెచ్చిపోయి వేణు స్వామి పై మండిపడ్డారు.