ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలు, మనుషుల మధ్య చిచ్చు పెడుతోంది.పాలస్తీనాకు మద్ధతుగా నిలుస్తోన్న వారిపై ఇజ్రాయెల్( Israel ) సానుభూతిపరులు.
ఇజ్రాయెల్‌కు సపోర్ట్ ఇస్తున్న వారిపై పాలస్తీనా( Palestine ) మద్ధతుదారులు దాడులు చేస్తున్నారు.గత నెలలో ఆస్ట్రేలియా ఆరేళ్ల ముస్లిం చిన్నారిని ఈ విద్వేషం బలిగొన్న సంగతి తెలిసిందే.
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో( Illinois ) ఆరేళ్ల ముస్లిం చిన్నారిని 71 ఏళ్ల వృద్ధుడు పొడిచి పొడిచి చంపాడు.బాలుడి శరీరంపై 26 కత్తిపోట్లు వున్నాయంటే నిందితుడిలో ఎంతటి విద్వేషం వుందో అర్ధం చేసుకోవచ్చు.
సెమిటిక్ వ్యతిరేక, ఇస్లామోఫోబిక్ హింసలో భాగంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.మరోసారి ఈ తరహా ఘటనలు జరగకుండా అమెరికాలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ క్రమంలో గత వారం న్యూయార్క్‌లోని ప్లే గ్రౌండ్‌లో పాలస్తీనా కండువా ధరించిన ఓ భారతీయ అమెరికన్,( Indian American ) అతని 18 నెలల కుమారుడిపై వేడి వేడి కాఫీ కప్పు విసిరిన ఘటన కలకలం రేపింది.దీనికి బాధ్యురాలైన మహిళను అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ అయ్యింది.
నవంబర్ 7న బ్రూక్లిన్‌లోని( Brooklyn ) ఎడ్మండ్స్ ప్లే గ్రౌండ్‌లో ఆశిష్ ప్రషార్ (40)( Ashish Prashar ) అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి ఆడుకుంటున్నాడు.ఆయన కెఫియా (పాలస్తీనా పురుషులు సాంప్రదాయకంగా తలకు ధరించే కండువా)ను పోలిన స్క్రాఫ్‌ను పెట్టుకున్నారు.
ఇది చూసిన నిందితురాలు.అతను పాలస్తీనాకు చెందిన వ్యక్తేమోనని భావించింది.ఆపై పరుగు పరుగున ఆశిష్ వద్దకు వచ్చి.మీరు హమాస్‌కు( Hamas ) మద్ధతు ఇస్తున్నారా, వాళ్లు టెర్రరిస్టులని తెలుసా.? మీ వాళ్లు పిల్లలను కాల్చేస్తారని తెలుసా.ఎవరైనా మీ బిడ్డను ఓవెన్‌లో వేసి కాల్చేస్తారా అంటూ ఊగిపోతూ మాట్లాడింది.
పరిస్ధితిని అర్ధం చేసుకున్న ప్రషార్.ఈ ఘటనను వీడియో రికార్డ్ చేసేందుకు తన ఫోన్‌ను తీస్తుండగా ఆ మహిళ తన మొబైల్‌ను, ఆపై వేడి వేడి టీ కప్పును అతనిపై విసిరి కొట్టింది.
అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్‌తో బాధితుడు మాట్లాడుతూ.తన కుమారుడిని రక్షించడమే తన లక్ష్యమన్నారు.ఆమె తనను ఉగ్రవాదిగా భావించిందన్నారు.ఈ దాడిలో ప్రషార్‌కు గానీ, అతని చిన్నారి కుమారుడికి గానీ ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు కారణమైన మహిళ పేరు, ఇతర వివరాలను పోలీసులు బహిర్గతం చేయలేదు.ఎక్స్‌లో పేర్కొన్న ప్రషార్ ప్రొఫైల్ ప్రకారం అతను రాజకీయ వ్యూహకర్త, రచయిత అని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో చిక్కుకున్న గాజాలోని( Gaza ) చిన్నారుల దుర్భర పరిస్ధితిపై ఆయన చేసిన కొన్ని పోస్టులు కనిపించాయి.