సరదా కోసమో, ఇతరులను వెర్రీవాళ్లుగా చిత్రీకరించేందుకు చేసే ప్రయత్నాలు కొందరినీ చిక్కుల్లో పడేస్తాయి.అమెరికాలో ఓ వ్యక్తి నకిలీ అస్థిపంజరానికి డ్రెస్ వేసి ప్రయాణికుడిగా కూర్చొబెట్టి, దీని సాయంతో అధిక ఆక్యుపెన్సీ వెహికల్ లైన్ (హెచ్ఓవీ)ని ఉపయోగించేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు.ఈ ఘటనపై ఆరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అధికారులు మాట్లాడుతూ.ఓ 62 ఏళ్ల వ్యక్తి కారులో నకిలీ అస్థిపంజరానికి టోపీ పెట్టి, దానిని తాడుతో సీటుకు గట్టిగా కట్టాడు.
దూరం నుంచి ఎవరైనా కారును చూస్తే అందులో నిజంగా ప్రయాణికుడు ఉన్నట్లే కనిపిస్తుంది.ఎట్టకేలకు దీనిని పసిగట్టిన అధికారులు సదరు డ్రైవర్‌కు జరిమానా విధించారు.ఆరిజోనాలో ప్రతి సంవత్సరం 7 వేల మంది డ్రైవర్లు హెచ్‌ఓవీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
దీనిపై ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అధికారులు “#NiceTry”, “#YoureNotHeMan” అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు.ఈ పోస్ట్‌లో కారు, సీటులో కూర్చొన్న అస్ధిపంజరం ఫోటోను పోస్ట్ చేశారు.గత ఏప్రిల్‌లోనూ ఒక వ్యక్తి బేస్ బాల్ క్యాప్, సన్‌గ్లాసెస్ ధరించిన బొమ్మతో హెచ్ఓవీ లేన్‌లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబట్టాడు.