నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపి వేశారని…రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా DCC అధ్యక్షుడు దేవ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ ఘటన పై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.మమ్మల్ని బెదిరించాలని YCP గూండాలు చూస్తున్నారు.కార్యకర్తలను బెదిరిస్తున్నారు.ఎవరు బెదిరించినా బెదరం.
YCP కి నేనంటే భయం పట్టుకుంది.YCP గుండెల్లో వణుకు పుడుతుంది.
నన్ను తిట్టిపోసినా…సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా బెదిరేది లేదు.ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ.
నేను రెడీ.మీరు రెడీనా.!