కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషపై( Heroine Trisha ) లియో సినిమా నటుడు మన్సూర్ అలీ ఖాన్( Mansoor Ali Khan ) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.గత రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
మన్సూర్ అలీ ఖాన్ చేసిన వాఖ్యలు అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో పాటు రాజకీయ నాయకులు అలాగే పలువురు సిని ప్రముఖులు కూడా ఆ వీడియోపై, అలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ మేరకు త్రిష కూడా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేసిన విషయం తెలిసిందే.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానవాళిని అవమానించడమేనని, మరోసారి మన్సూర్ అలీ ఖాన్‌తో కలిసి తాను నటించను అని త్రిష తెలిపింది.ఆమెకు తమిళ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది.తమిళ సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఈ వివాదంపై స్పందించారు.తాజాగా మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా( Minister RK Roja ).మన్సూర్ అలీ ఖాన్ లాంటి మగాళ్ల మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.
ఆడవాళ్ల గురించి మగాళ్లు అసభ్యకరంగా మాట్లాడినప్పుడల్లా, వారిపై కఠినంగా చట్టపరమైన, పోలీస్ చర్యలు తీసుకోవాలి.

వాళ్లు నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, ఖుష్బూ, నాపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ కావచ్చు.కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో ఈ మగాళ్లు ఇలాగే అస్సలు భయపడకుండా ఏదైనా మాట్లాడతారు.మమ్మల్ని ఈ విధంగా టార్గెట్ చేసినా రాజకీయాలు, సినిమాల్లో ఎదిగి చూపించాం.
ఇలాంటి మగాళ్లను ఇతర మహిళలు కలిస్తే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి? అని రోజా ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు.