ఎన్ఆర్ఐ యశ్ కు పాస్ పోర్టు ఇవ్వాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
అయితే ఇటీవల తన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన యశ్ ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారన్న విషయం తెలిసిందే.ఆ సమయంలోనే సీఐడీ యశ్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పాస్ పోర్టు స్వాధీనం చేసుకుని ఇవ్వడం లేదని యశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం పాస్ పోర్టును ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు చేస్తున్న ఎన్ఆర్ఐ యశ్ ను విమానాశ్రయంలోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.