ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.గుండుమల కేఎస్ తండాకు చెందిన రమేష్ నాయక్ ( Ramesh Naik )పోలీస్ శాఖలో జాబ్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తన చదువును పూర్తి చేసుకుని రమేష్ పోలీస్ పరీక్షకు సిద్ధమయ్యారు.ప్రస్తుతం రమేష్ అనుకున్న లక్ష్యాన్ని సాధించి కెరీర్ పరంగా ఎదిగారు.

అనంతపురం( Anantapur ) ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన రమేశ్ రెండుసార్లు పోటీ పరీక్షలో తప్పినా ఆత్మస్థైర్యం కోల్పోలేదని తెలుస్తోంది.మూడో ప్రయత్నంలో రమేష్ సివిల్ ఎస్సై పోస్ట్ కు అర్హత సాధించడం గమనార్హం.రమేష్ తల్లీదండ్రులు రోజువారీ కూలిపనులు చేసి పిల్లలను చదివించడం గమనార్హం.రమేష్ నాయక్ సోదరుడు చంద్ర నాయక్ గుడిబండ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉన్నారు.

మూడో కొడుకు బెంగళూరు( Bengaluru )లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు.ఎస్సైగా అర్హత సాధించిన రమేష్ నాయక్ ను ఈ సందర్భంగా తండా వాసులు అభినందించారు.రమేష్ నాయక్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రమేష్ నాయక్ సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.రమేష్ నాయక్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.రమేష్ నాయక్ బాల్యం నుంచి అంతకంతకూ ఎదుగుతూ సత్తా చాటుతున్నారు.
రమేష్ నాయక్ టాలెంట్ గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.రమేష్ నాయక్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.
పోలీస్ శాఖలో పని చేయాలనేది చాలామంది కల కాగా రమేష్ నాయక్ ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకున్నారు.రమేష్ నాయక్ ఎస్సై కావడంతో స్వగ్రామంలో ప్రస్తుతం ఆయన పేరు మారుమ్రోగుతుండటం గమనార్హం.







