అనుష్క శెట్టి నటించిన మెగా మూవీ ‘నిశ్శబ్దం’ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌ జనవరి 24 న మీ జీ తెలుగులో

జీ తెలుగు తమ అభిమాన ప్రేక్షకుల కోసం థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన మెగా మూవీ నిశ్శబ్దం వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది.నిశ్శబ్దం సినిమా జనవరి 24, 2021 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానల్లలో ప్రసారమవుతుంది.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, ఆర్ మాధవన్, అంజలి, షాలిని పాండే మరియు హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రధారులుగా మన ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించాడు.

 Anushkas-latest-movi-nishabdam-comming-january-24-in-zee-telugu,anushkashetty-ni-TeluguStop.com

పుట్టుకతో మూగ, చెవుడు యువతి సాక్షి (అనుష్కశెట్టి) అద్భుతమైన పెయింటర్.

ఆంథోని (ఆర్ మాధవన్) గొప్ప సంగీతకారుడు.ఇద్దరిలోని ప్రతిభ ఒకరినొకరు దగ్గరయ్యేలా చేస్తుంది.

ఎంగేజ్‌మెంట్ తర్వాత సాక్షి స్నేహితురాలు సొనాలి (షాలిని) అదృశ్యం అవుతుంది.ఆ క్రమంలో అనూహ్య పరిస్థితుల్లో ఆంథోని హత్యకు గురవుతాడు.

ఆంథోని హత్య మిస్టరీగా మారడంతో ఆ కేసును ఛేదించడానికి పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్ రిచర్డ్ (మైఖేల్ మ్యాడ్సన్) సహాయంతో మరో పోలీసు అధికారి మహాలక్ష్మి (అంజలి) రంగంలోకి దిగుతుంది.ఆంథోని మరణానికి కారణమేమిటి? సొనాలి అదృశ్యం వెనుక కారణాలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే నిశ్శబ్దం సినిమా కథ.

గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకుంది.మధురం పాట ఫీల్‌గుడ్‌గా సాగుతుంది.

గిరిష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్గా నిలవగా, షానిల్ డియో సినిమాటోగ్రఫి ఆకర్షణగా నిలుస్తుంది.

సూపర్‌ థ్రిల్లర్ ఫిల్మ్‌ నిశ్శబ్దం సినిమా జనవరి 24, 2021 సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానల్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి


జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.
సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube