లిప్ లాక్ మీమ్స్ పై స్పందించిన అనుపమ.. సినిమా చూస్తే నిర్ణయం మార్చుకుంటారు!

దిల్ రాజు ఇంటి నుండి మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే.రౌడీ బాయ్స్ చిత్రం ద్వారా ఆశిష్ రెడ్డి హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

 Anupama Responds To Lip Lock Memes After Movie Watch You Will Change Your Mind,-TeluguStop.com

హరీష్ కొనగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.కాకపోతే ఈ సినిమాలో ఆశిష్ సరసన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటించిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయడంతో అనుపమ పరమేశ్వరన్ దారుణమైన ట్రోలింగ్ కి గురయ్యారు.ఈ ట్రైలర్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ కిస్ చేయడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు ఈమె పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బు కోసం ఇలా దిగజారాలా? అంటూ ప్రశ్నించారు.అదేవిధంగా ఈమెపై ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లిప్ లాక్ మీమ్స్ గురించి స్పందించారు.

ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.లీడ్ పెయిర్ ఆ మీమ్స్ ను చూసి, అభిమానుల క్రియేటివిటీని చూసి ఈమె బిగ్గరగా నవ్వారు.అదేవిధంగా లిప్ లాక్ సన్నివేశం సినిమాలో ఒక భాగం మాత్రమేనని, ఈ సినిమాలో కేవలం హీరో పాత్ర నా పాత్రను మాత్రమే ముద్దు పెట్టుకుంది అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ సినిమా చూస్తే అసలు విషయం మీకే అర్థమవుతుందని, సినిమా చూసిన అనంతరం మీ అభిప్రాయాన్ని, మీ నిర్ణయాన్ని మార్చుకుంటారని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ రౌడీ బాయ్స్ చిత్రంలోని లిప్ లాక్ సన్నివేశం పై స్పందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube