తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన అనుచరులతో సమావేశం నిర్వహించారు.
అయితే పార్టీ జెండాలు లేకుండానే అనుచర వర్గంతో జలగం భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై ఆయన కొంత అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
బీఆర్ఎస్- సీపీఐ పొత్తుల నేపథ్యంలో ఈ సారి కొత్తగూడెం టికెట్ సీపీఐకి వెళ్తుందనే వార్తలు సైతం జోరుగా సాగుతున్నాయి.ఈ సమయంలో జలగం సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.