తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు,క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫైట్ మాస్టర్ అయినా విజయ్ రంగరాజు( Vijay Rangaraju ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్నో సినిమాలలో విలన్ గా ఫైట్ మాస్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫైటర్ గా ఇలా అన్ని రంగాల్లో తనదైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
దాదాపుగా వెయ్యికి పైగా సినిమాలలో నటించి మెప్పించాడు విజయ్ రంగరాజు.కాగా జాకీ ష్రాఫ్, రంగరాజు ఇద్దరు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు.
ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
ఎన్టీరామారావు( Nt rama Rao ) వీరాభిమానిని అని చెప్పుకునే రంగరాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు విజయ్ రంగరాజు.ఈ సందర్భంగా విజయ్ రంగరాజు మాట్లాడుతూ.
నాకు పోలీస్ కావాలన్నది ఆశ.కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది.ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను.అప్పుడు చాలా కష్టాలు పడ్డాను.పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని.తినడానికి తిండి ఉండేది కాదు.
మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని.ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని.
నా మొదటి సినిమా బాపుగారి( Bapugari ) దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణి( Sita Kalyani ).సినిమాలో వేషం కోసం ట్రై చేశాను.15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు.సరే అని అడ్వాన్స్ అడిగాను.వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు.మరి బతకాలి కదా సర్ అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను.ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించరు అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు.