ప్రముఖ బాలీవుడ్( Anurag kashyap ) డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ తాజాగా ఒక చక్కటి శుభవార్త తెలిపింది.అయితే గత కొంతకాలంగా షేన్ గ్రెగోయిర్( shane-gregoire ) ప్రేమలో మునిగితేలుతున్న ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది.
అందులో భాగంగానే తాజాగా ఆలియా నిశ్చితార్థం జరిగింది.ఈ సందర్భంగా తన ప్రేయసి వేలికి ఉంగరాన్ని తొడిగాడు షేన్.
తాజాగా ఈ ఫోటోలను ఈ జంట తమ సోషల్ మీడియా( Social media ) ఖాతాల్లో పోస్ట్ చేశారు.ఇందులో తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని హైలైట్ చేసిన ఆలియా మరో ఫోటోలో ప్రియుడికి గాఢంగా ముద్దు పెట్టింది.
ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.మొత్తానికి మేము అనుకుంది జరిగింది.నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్‌నర్, నా సోల్‌మేట్ ఇప్పుడు నా భర్త అయ్యాడు.నా జీవితానికి దొరికిన అమూల్యమైన ప్రేమవు నీవే.అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు థ్యాంక్స్.నీ ప్రపోజల్‌కు ఎస్ చెప్పడం నేను చేసినవాటిలో అత్యంత సులువైన పని.నీతో జీవితాన్ని కొనసాగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను.ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
నిన్ను ఫియాన్సీ అని పిలిచే రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను అని రాసుకొచ్చారు.
కాగా ఈ ఎంత వారి ప్రేమ విషయాన్ని 2020లో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.వీరి ప్రేమ విషయాన్ని ప్రకటించి ఏడాది జూన్ కి దాదాపు మూడేళ్లు అవుతోంది.గత కొంతకాలంగా డేటింగ్ లో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.
తాజాగా వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.