హైదరాబాద్ కూకట్ పల్లిలోని అడ్డగుట్ట ఘటనలో మరొకరు మృతిచెందారు.నిర్మాణంలో ఉన్న భవనం కూలి ప్రమాదవశాత్తు స్పాట్ లోనే ఇద్దరు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.మరోవైపు జీహెచ్ఎంసీ భవనం కూల్చివేత పనులను ప్రారంభించింది.జీ+5 అనుమతి తీసుకున్న యజమాని నిబంధనలను అతిక్రమించి జీ+7 నిర్మిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో అనుమతి లేని ఫ్లోర్లను కూల్చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆరో అంతస్తును అధికారులు పూర్తిగా కూల్చివేయనున్నారని సమాచారం.మృతులు ఒడిశాకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.