గతంలో అలాంటి ఫొటోలకి ఫోజులిచ్చి పొరపాటు చేశాను...

కొంతమంది హీరో హీరోయిన్ల కి వచ్చి రావడంతోనే స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ తో కలిసి నటించే అవకాశం వరించడంతో మొదటి సినిమాతోనే సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ తమ వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్నటువంటి సంఘటనల కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.కాగా తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.

 Annamayya Movie Fame Kasthuri Shankar Reacts About Bold Photoshoot For Magazine,-TeluguStop.com

రాఘవేంద్రరావు మరియు టాలివుడ్ హీరో కింగ్ నాగార్జునల కాంబినేషన్ లో తెరకెక్కిన “అన్నమయ్య” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ ప్రముఖ హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా ఈ కోవకే చెందుతుంది.కాగా నటి కస్తూరి శంకర్ కి వచ్చి రావడంతోనే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి ఆరంభం లభించింది.

దీంతో కస్తూరి దాదాపుగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.కానీ కస్తూరి మాత్రం తమిళ చలన చిత్ర పరిశ్రమలో సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ని పక్కన పెట్టింది.

ఈ క్రమంలో తమిళ చలన చిత్ర పరిశ్రమలో కస్తూరి హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి.దీంతో కస్తూరి శంకర్ కి ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

ఈ క్రమంలో కస్తూరి శంకర్ అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొనేది.

దీంతో ఆ మధ్య కస్తూరి ఓ ప్రముఖ మ్యాగజైన్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమం లో పాల్గొని బిడ్డకి పాలు పట్టిస్తున్న సమయంలో పలు ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

దీంతో ఆ మ్యాగజైన్ సంస్థ ఏకంగా తమ మ్యాగజైన్ కవర్ పై కస్తూరి శంకర్ చిన్నారికి పాలు పట్టిస్తున్న సమయంలో తీసిన ఫోటోలని ప్రచురించింది.అయితే ఈ మ్యాగజైన్ అమెరికాలో విడుదల అయినప్పటికీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో కస్తూరి శంకర్ గురించి నెగిటివ్ గా ప్రచారాలు చేస్తున్నారు.

దీంతో కొందరు నెటిజన్లు కస్తూరి శంకర్ పై అసభ్యకర కామెంట్లు మరియు నెగిటివ్ ట్రోల్స్ చేయడం వంటివి చేస్తున్నారు.దీంతో తాజాగా కస్తూరి శంకర్ ఈ విషయంపై ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో స్పందించింది.

Telugu Annamayya, Telugu Actress, Telugu, Tollywood-Movie

ఇందులో భాగంగా తను కేవలం చిన్నారికి పాలు పట్టే ఉద్దేశంతోనే ఫోటోలకి ఫోజులు ఇచ్చానని అంతే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేసింది.కానీ ఈ మధ్య కాలంలో కొందరు ఈ ఫోటోలలో తను కనిపించిన విధానాన్ని అసభ్యకరంగా చిత్రీకరిస్తూ తప్పుగా ప్రచారాలు చేస్తున్నారని అది సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.అలాగే తాను పాల్గొన్న మ్యాగజైన్ ఫోటోషూట్ సంస్థ అమెరికా దేశానికి చెందిన దని కానీ కొందరు వ్యక్తులు అనధి కారికంగా తన ఫోటోలను వాడుకున్నారని ఫైర్ అయ్యింది.అంతేకాకుండా బిడ్డకి పాలు పట్టే విధానంలో కూడా తప్పులు వెతుకుతున్న సమాజంలో మనం ఉన్నామంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

చివరిగా తాను ఇలాంటి మ్యాగజైన్ ఫోటోలకి ఫోజులు ఇచ్చినందుకు బాధపడుతున్నానని కూడా చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా మొదటి ఇన్నింగ్స్ హీరోయిన్ గా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా అటువంటి కస్తూరి శంకర్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వరుసగా సినిమా ఆఫర్లు దర్శించుకుంటూ దూసుకుపోతోంది.

ఈ క్రమంలో తెలుగు, తమిళం, మలయాళం, తదితర భాషలలో దాదాపు ఏడాదికి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న “ఇంటింటి గృహలక్ష్మి” అనే ధారావాహికలో కూడా మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube