కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరు అంటే ”అనిరుద్ రవిచందర్( Anirudh Ravichander )” అనే చెప్పాలి.ఈయన ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ లోనే టాప్ 1 లో దూసుకు పోతున్నాడు.
వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించు కున్నాడు.తమిళ్ లో క్రేజ్ రావడంతో ఈయన తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడుప్రస్తుతం అనిరుద్ తమిళ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతూ.
ఎన్నో క్రేజీ ఆఫర్స్ ను తన చేతిలో పెట్టుకున్నాడు.అనిరుద్ రవిచందర్ కోలీవుడ్, టాలీవుడ్ లో దాదాపు 8 సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టాడు.
ఈయన క్రేజ్ దృష్ట్యా భారీ సినిమాల ఆఫర్స్ కూడా అందుకుంటున్నాడు.అయితే తాజాగా ఈయన నుండి రెండు అప్డేట్స్ వచ్చాయి.
ఈ రెండు అప్డేట్స్ కూడా నిరాశ పరిచాయి.ఈ రోజుల్లో సంగీతం సినిమాకు మేజర్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.ముందుగా పాటలు ఆడియెన్స్ లో హిట్ అయితేనే ఆ సినిమాకు భారీ హైప్ వస్తుంది.అలాంటిది అనిరుద్ సంగీతం సినిమాలపై ప్రభావం చూపలేక పోతున్నాయి.
ఇదే విషయం పై కోలీవుడ్( Kollywood ) లో చర్చ జరుగుతుంది.

అనిరుద్ ఆ మధ్య కాలంలో ఇచ్చిన ఫస్ట్ సింగిల్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ సెన్సేషన్ క్రియేట్ చేసాయి.కానీ ఇప్పుడు భారీ హైప్ ఉన్న సినిమాలకు కూడా ఈయన మ్యూజిక్ పరంగా మ్యాజిక్ చేయలేక పోతున్నాడు.

తాజాగా వచ్చిన జైలర్ ఫస్ట్ సింగిల్, అలాగే ఇటీవలే వచ్చిన లియో ఫస్ట్ సింగిల్ ( LEO – First Single )సైతం అంతగా ఆకట్టుకోలేక పోయాయి.వీటిలో అనిరుద్ మార్క్ కనిపించడం లేదని అంటున్నారు.ఇంతకు ముందు ఇతడు ఫస్ట్ సింగిల్ ఇస్తే అది చార్ట్ బస్టర్ గా నిలిచి పోయేది.
కానీ ఇప్పుడు అలా ఉండడం లేదని పెదవి విరుస్తున్నారు.