టాలీవుడ్, శాండిల్ వుడ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న చాలామంది డైరెక్టర్లు గ్రాఫిక్స్ తో తెరకెక్కించే సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )మాత్రం భిన్నమైన దారిలో వెళుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ప్రతి సినిమాలలో ఒక తాత, బొగ్గుతో తెరకెక్కిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
హీరో శరీరానికి బొగ్గు పూసి ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.చాలామంది దర్శకులతో ( directors )పోల్చి చూస్తే ప్రశాంత్ నీల్ గ్రేట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ను కూడా డార్క్ షేడ్ లో కనిపించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ సలార్ టీజర్( Salar Teaser ) తో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు.సలార్ టీజర్ కు ఇప్పటివరకు 85 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.సలార్ సినిమాలో శృతిహాసన్ ఆద్య అనే జర్నలిస్ట్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబో మూవీకి ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ కాగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమా అసలు టైటిల్ కు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

ప్రాజెక్ట్ కే ( Project K )సినిమాకు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇప్పటికే విడుదల కాగా ప్రభాస్ ఇతర సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.ప్రభాస్ సినిమాలపై అంచనాలు పెరుగుతుండగా ప్రభాస్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రశాంత్ నీల్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.