దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా సీబీఐ కేసులో అప్రూవర్ గా మారిన వ్యాపార వేత్త దినేష్ అరోరాను ఈడీ అదుపులోకి తీసుకుంది.
అనంతరం ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.ఈ నేపథ్యంలో దినేశ్ అరోరాను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
అనంతరం తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.







