డైరెక్టర్ తేజ( Teja ) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మొదట్లో నిర్మాతగా, రచయితగా, చాయ్ అగ్రహకుడిగా చేసిన ఈయన ఆ తర్వాత దర్శకుడుగా మారాడు.
మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.నువ్వు నేను, జయం సినిమాలతో దర్శకత్వం వహించి తనకే కాకుండా ఆ సినిమాలో నటించిన హీరోలకు కూడా మంచి విజయాన్ని అందించాడు.
ఎన్నో మంచి మంచి సినిమాలు చేసిన ఈయన గత కొన్ని రోజుల నుండి కాస్త డీల పడుతున్నాడు.ఇక ఇప్పటికే ఎంతోమంది కొత్త కుర్రాలని హీరోగా పరిచయం చేసిన ఈయన ఇప్పుడు అహింస సినిమాతో దగ్గుబాటి అభిరామ్( Abhiram Daggubati ) ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమా జూన్ 2న విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా.ప్రస్తుతం ప్రమోషన్స్ భాగంలో తేజ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని షాకింగ్ విషయాలు బయటపెడుతున్నాడు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ( Andhra people )ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఆంధ్ర బ్యాంకు అని ఒకటి ఉండేది.కానీ ఇప్పుడు ఉందా.లేదు.విలీనం చేశారు.
అదే పంజాబ్ బ్యాంకు ఉంది.కెనరా బ్యాంకు ఉంది.
కానీ ఆంధ్ర బ్యాంకు లేదు.కారణం ఆంధ్ర వాళ్లకి మన అనే ఫీలింగ్ లేదు.
ఆ మాకేంది పోతే పోయింది అనుకున్నారు.
మనకు సిగ్గు లేదు.ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని అడ్డుకోవటానికి ఎవరు ప్రయత్నించలేదు.అసలు పట్టించుకోలేదు.
అందుకే ఆంధ్రా వాళ్లకు సిగ్గులేదు అంటున్నాను అని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు తేజ.ఇక ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాగా వైరల్ అవ్వగా.ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనపై బాగా ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తుంది.ఇక ఈయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే దగ్గుబాటి అభిరామ్ సినిమాకు తిప్పలు తప్పవేమో అన్నట్లుగా అనిపిస్తుంది.ఇక సినిమా విడుదల తర్వాత అసలు విషయం ఏంటో చూడాలి.