Kumari Aunty : కుమారి ఆంటీగా మారిన సుమక్క… రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ?

కుమారి ఆంటీ ( Kumari Aunty ) ఫుడ్ స్టాల్ బిజినెస్ నడుపుతూ ఎంతో ఫేమస్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఫుడ్ స్టాల్ బిజినెస్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ఉన్నారు.

 Anchor Suma Latest Video Goes Viral In Social Media-TeluguStop.com

అదే విధంగా ఈమె పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాలో ఈమె చెప్పినటువంటి మాటలను ఏకంగా డీజే సాంగ్ గా క్రియేట్ చేసిన సంగతి కూడా తెలిసిందే.అంతేకాకుండా రెండు లివర్లు ఎక్స్ట్రా మీది 1000 అయింది అంటూ ఈమె చెప్పే ఈ కామెంట్స్ పట్ల చాలామంది రీల్స్ కూడా చేశారు.

అయితే తాజాగా ఇదే రీల్ యాంకర్ సుమ ( Suma ) కూడా చేశారు.

సుమ టాలీవుడ్( Tollywood ) యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు.ఇలా యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఇక సోషల్ మీడియా ద్వారా ఈమె ఎన్నో రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.ఇక సుమ ఎక్కువగా తన టీం తో కలిసి రీల్స్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.

తాజాగా కుమారి ఆంటీనీ ఇమిటేట్ చేస్తూ ఈమె చేస్తున్న రీల్ వీడియో వైరల్ గా మారింది.

షూటింగ్ లొకేషన్లో ఫుడ్ రావడంతో ఆ ఫుడ్ అందరికీ ఈమె వడ్డిస్తూ కుమారి ఆంటీలా మారిపోయారు నీకేం కావాలి చిన్న అంటూనే ఈమె కుమారి ఆంటీని ఇమిటేట్ చేశారు.మీది 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్ కూడా సుమ వేశారు ఇక మధ్య మధ్యలో బ్రహ్మాజీ కామెడీని కూడా పండించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్స్ అదేంటి సుమక్క యాంకరింగ్ మానేసి ఫుడ్ బిజినెస్ పెట్టావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి యాంకర్ సుమ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube