అమెరికన్స్ మన్ననలు అందుకుంటున్న హైదరాబాద్ వాసి...

తెలుగు రాష్ట్రాల నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే తెలుగు వారు ఉన్నత ఉద్యోగాలు , వ్యాపారాల కోసం వలసలు వెళ్ళారు.అలా వలసలు వెళ్ళిన వారు ఎంతో ఉన్నత స్థానాలను అధిరోహించారు కూడా.

 Americans Praising Hyderabad Man Ashfaq Hussain Syed-TeluguStop.com

అక్కడి సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకోవడమే కాదు, ఎంతో మందికి తమ వ్యాపారాల ద్వారా ఉపాది సైతం కల్పిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా తమవంతు సాయం చేస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ మూలాలు ఉన్న ఓ ఇండో అమెరికన్ కు అక్కడి ప్రభుత్వం అరుదైన గుర్తింపు ఇచ్చి గౌరవించుకుంది.

ఆయన పేరు అష్పాక్ హుస్సేన్ సయ్యద్ అమెరికాలో, అరబ్బు దేశాలలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు.భారతదేశంలో, అమెరికాలో, అరబ్బు దేశాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అష్పాక్ హుస్సేన్ సయ్యద్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.

 Americans Praising Hyderabad Man Ashfaq Hussain Syed-అమెరికన్స్ మన్ననలు అందుకుంటున్న హైదరాబాద్ వాసి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం డబ్బు సంపాదించడమే కాదు, సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.తను స్థాపించిన వ్యాపారాలు కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదని, ఎంతో మంది యువతకు ఉపాదికల్పించడం కోసమేనని ఎన్నో సందర్భాలలో ప్రకటించారు.

అమెరికాలోని చికాగో ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఆయన ఇప్పటి వరకూ ఎంతో మంది పేదలకు సాయం అందించారు.ఈ క్రమంలోనే అష్పాక్ హుస్సేన్ సయ్యద్ సేవలను గుర్తించిన స్థానిక మేయర్ స్టీవ్ చిరికో నాపెర్విల్లె పబ్లిక్ లైబ్రరీ బోర్డ్ ట్రస్టీ గా కీలక భాద్యతలు అప్పగించారు.2020 లోనే ఆయనకు ఈ గౌరవం అప్పగించగా 2023 వరకూ కొనసాగానుంది.ఎంతో మంది తెలుగు ప్రవాసులకు సాయం చేయడంలో కానీ, ఉపాది కల్పించడంలో కానీ ఆయన ముందుండేవారని, సేవా కార్యక్రమాలు చేపట్టడంలో రాజీపడే వ్యక్తి కాదని అంటున్నారు ప్రవాసులు.

ముఖ్యంగా అమెరికాలో చికాగో ప్రాంతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు అక్కడి అమెరికా వాసులకు ఎంతో మేలు చేకూర్చాయి.

#PublicLibrary #AshfaqHussain #AshfaqHussain #Chicago #NRI

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు