అగ్ర రాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా లో జరగనున్న ఎన్నికలు ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.ఈ ఎన్నికల్లో గెలుపు డెమోక్రటిక్ ని వరిస్తుందో లేక రిపబ్లికన్ పార్టీని వరిస్తుందోననే ఉత్ఖంట అందరిలో నెలకొంది.
ఎందుకంటే రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఈ మేయర్ ఎన్నికలని ఇరు పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
కాలిఫోర్నియాలో జరగనున్న ఈ మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ అపర్ణ మాదిరెడ్డి పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మేరకు ఆమె ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.అంతేకాదు ఇప్పటికే తానూ ప్రచారం మొదలు పెట్టానని తెలిపారు.కాలిఫోర్నియా అభివృద్ధితో పాటు స్థానిక ప్రజలు చేదోడు వాదోడుగా ఉంటానని ఆమె తెలిపారు.డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అపర్ణ ఇకపై.
పూర్తి స్థాయిలో పార్టీలో సేవలు అందిస్తానని ప్రకటించారు.ఇదిలాఉంటే ఒపేరా స్పేస్ అడ్వైజరీ కమిటీకి చైర్మెన్ గా వ్యవహరిస్తున్న ఆమె తన భర్త సాయంతో ఓ మల్టీ నేషనల్ కంపెనీ స్థానిపించారు.ఎన్నో వేల మందికి ఆ కంపెనీ ద్వారా సేవలు అందిస్తున్నారు.తాను ఈ మేయర్ ఎన్నికల పోటీలో గెలుపొందుతాననే నమ్మకం పూర్తిగా ఉందని అన్నారు.