అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌కు చెందిన పది బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ను కోల్పోవడంపై అమెజాన్ షాక్‌కు గురైన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తన ప్రత్యర్థి మైక్రోసాఫ్ట్‌కు దక్కడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించకుండా ఉండేందుకు గాను ‘‘తాత్కాలిక స్టేను’’ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది.
జాయింట్ ఎంటర్‌ప్రైజ్ డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జేడీఐ) క్లౌడ్ కాంట్రాక్టుపై ఫిబ్రవరి 11 నుంచి మైక్రోసాఫ్ట్ తన పనిని ప్రారంభించనుంది.
కాగా ఈ కాంట్రాక్టు అప్పగింతలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.మిలటరీలోని క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఆధునికీకరించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.దీనిని చేజిక్కించుకోవడానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఒరాకిల్, గూగుల్ సంస్థలు పోటీ పడ్డాయి.జేడీఈఐ ప్రాజెక్ట్ అమెజాన్‌కు దక్కుతుందని అంతా భావించారు.
అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదం నేపథ్యంలో తమకు ఈ బిడ్ దక్కకుండా అగ్రరాజ్యాధినేత కలగజేసుకున్నారని అమెజాన్‌కు చెందిన ఓ అధికారి మండిపడ్డారు.
జేఈడీఐ ప్రాజెక్ట్‌లో భాగంగా క్లౌడ్‌లోని సమాచారాన్నంతా ఏకీకృతం చేయనున్నారు.ఆర్మీ ఉపయోగించే సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు, రిమోట్ సెన్సార్లు తద్వారా కృత్రిమ మేధను వినియోగిస్తున్న తరుణంలో సమాచారాన్ని ఏకీకృతం చేసే ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడనుంది.
వనరులు, సాంకేతికత ఇతర అంశాల ఆధారంగా ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని నిర్వహించగలిగే సామర్ధ్యం అమెజాన్‌కి మాత్రమే ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్‌కి అప్పగించడంపై నిరసనలు వెల్లువెత్తాయి.అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సర్వర్లు, సదుపాయాలను మైక్రోసాఫ్ట్ సమకూర్చుకోవడం కొసమెరుపు.కాగా అమెజాన్ ఆరోపణలను రక్షణశాఖ (డీఓడీ) అధికారులు ఖండించారు.
టెండర్ ప్రక్రియ విశ్లేషణను అనుభవజ్ఞులైన నిపుణులు నిర్వహించినట్లు తెలిపారు.