నా కలర్ చూసి రిజెక్ట్ చేస్తే ఏడ్చేశానన్న ఆమని.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కలర్ వల్ల ఎన్నో సినిమాల్లో అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చారు.నేను ఫోటోలు పంపిస్తే రిజెక్ట్ అయిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

 Amani Shocking Comments About Her Color Details Here Goes Viral In Social Media-TeluguStop.com

నేను తెలుగు ఎక్కడా ట్రై చేయలేదని ఆమని అన్నారు.నాన్నగారు ఫ్రెండ్స్ అంతా తమిళ వాళ్లు అని ఆమె తెలిపారు.

స్టార్టింగ్ లో ఎలా ఉండాలో కూడా నాకు తెలియదని ఆమని పేర్కొన్నారు.

నేను ఇండస్ట్రీకి సెట్ కానని కామెంట్లు వినిపించాయని ఆమె చెప్పుకొచ్చారు.

నాకు యాక్టింగ్ అంటే ఆసక్తి అని అయితే బయట ఎలా ఉండాలో నాకు తెలియదని ఆమె వెల్లడించారు.నన్ను నేను మార్చుకుని ఆమని అన్నారు.మేకప్ టెస్ట్ అయిన తర్వాత ఆఫర్లు కూడా కోల్పోయానని ఆ సమయంలో ఏడ్చానని ఆమె తెలిపారు.కొన్ని సినిమాల్లో అడ్జస్ట్మెంట్లు ఉంటాయని అందుకే నాన్నగారు సినిమాల్లోకి వద్దని చెప్పారని అనిపించిందని ఆమని కామెంట్లు చేశారు.

ప్రతి ఫీల్డ్ లో మంచి ఉంటుందని చెడు ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.ఏది ఎంచుకుంటామనేది మన ఇష్టం అని ఆమె వెల్లడించారు.ఇండస్ట్రీలో మంచి వాళ్లు ఉంటారని నేను ఎదురుచూశానని ఆమని తెలిపారు.టి.రాజేందర్ గారి దగ్గర పని చేసే అవకాశం నాకు దక్కగా హీరోయిన్ కు ఫ్రెండ్ రోల్ లో చేయాలని కోరారని ఆమె పేర్కొన్నారు.నా కలర్ వల్ల అవకాశాలు తగ్గాయని ఆమని అన్నారు.

ఆ తర్వాత తెలుగులో ఆఫర్ వచ్చిందని ఆమె వెల్లడించారు.అప్పట్లో మీడియాకు ఇంత పబ్లిసిటీ లేదని ఆమని తెలిపారు.ఇ.వి.వి.సత్యనారాయణ గారి సినిమాతో నా లైఫ్ టర్న్ అయిందని ఆమె పేర్కొన్నారు.జంబ లకిడి పంబ సినిమాలో ఛాన్స్ రాగా అప్పట్లో నాకు 40,000 రూపాయల రెమ్యునరేషన్ దక్కిందని ఆమని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube