కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయనకు కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ ఉంది.
ఇక విజయ్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి.దీంతో ఈయనకు ఇక్కడ కూడా కొద్దిగా మార్కెట్ అయితే ఉంది.
పండుగ సీజన్స్ లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది.తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వారసుడు సినిమా ఈ విషయాన్నీ నిరూపించింది.
ఇది ఒరిజినల్ గా వారిసు పేరుతో తమిళ్ లో తెరకెక్కింది.తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించగా.రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా 250 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది.ఈ సినిమా తెలుగు కంటే తమిళ్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది అనే చెప్పాలి.
ఇక థియేటర్స్ లో లాంగ్ రన్ పూర్తి చేసుకున్న వారసుడు సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.విజయ్ ఫ్యాన్స్ అంతా ఓటిటిలో వారసుడు సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఎట్టకేలకు ఈ సినిమా అయితే నేటి నుండి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.అయితే వారసుడు ఫ్యాన్స్ కు ప్రైమ్ వీడియో వారు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసారు.
ముందుగా విజయ్ నటించిన వారసుడు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కేవలం ముందు భాషల్లోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్టు తెలిపారు.అయితే ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా 4 భాషల్లో రిలీజ్ అయ్యింది.తెలుగు, తమిళ్, మళయాళంతో పాటు కన్నడ భాషల్లో కూడా వారసుడు స్ట్రీమింగ్ అయ్యింది.మరి థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు ఓటిటిలో ఎంజాయ్ చేయవచ్చు.