గో లోకల్... బీ వోకల్ అంటూ చాలెంజ్ చేసిన అల్లు శిరీష్

కొద్ది రోజుల క్రితం మెగా యంగ్ హీరో అల్లు శిరీష్ గో లోకల్ బీ వోకల్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.గాల్వాన్ వ్యాలీలో చైనా దురాక్రమణ, భారత్ జవాన్లుని చంపిన తర్వాత దేశీయంగా చైనా వస్తువులని బ్యాన్ చేయాలని డిమాండ్ వచ్చింది.

 Allu Sirish Started Go Local Be Vocal Challenge, Tollywood, Made In India, Make-TeluguStop.com

అదే సమయంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తే దేశంలోని కంపెనీలకి ఊతం ఇచ్చినట్లు అవుతుందని, దేశీయ మార్కెట్ పెంచడానికి అవకాశం దొరికుతుందని భావించి యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పాయల్ గోష్ సూచన దేశీయ ఉత్పత్తులని ప్రోత్సహించడానికి అల్లు శిరీష్ హాష్ ట్యాగ్ ఉద్యమం సోషల్ మీడియాలో మొదలు పెట్టాడు.తాను దేశీయ ఉత్పత్తులని కొని వాటితో ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చాడు.

ఇక ఇప్పటికే అల్లు శిరీష్ మొదలు పెట్టిన గో లోక‌ల్ బీ వోక‌ల్ ఉద్యమానికి విశేష స్పందన వస్తుంది.ఈ సోషల్ మూమెంట్ తర్వాత దశలో భాగంగా అల్లు శిరీష్ తన సన్నిహితులకు, కొందరు ఫిల్మ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలకు దేశీయ ఉత్పత్తులతో కూడిన గిఫ్ట్ హంపర్స్ పంపించి, వారిని కూడా ఈ గో లోకల్ బీ వోకల్ ఉద్యమంలో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు.

దీనికోసం సోషల్ మీడియా చాలెంజ్ ని ఇతర సెలబ్రిటీలకి ఇచ్చాడు.శిరీష్ ఛాలెంజ్ విసిరిన సినీ తారల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, రకుల్ ప్రీత్, అను ఇమ్మానుయేల్, రాశి ఖన్నా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఉన్నారు.

వీరితో పాటు ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కూడా ఉండటం విశేషం.మరి ఈ స్టార్ సెలబ్రిటీలు గో లోకల్, బీ వోకల్ చాలెంజ్ ని ఎంత వరకు ముందుకి తీసుకొని వెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube