టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
ప్రస్తుతం ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన క్రేజ్ ఉందనీ చెప్పాలి.ఇకపోతే అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీకానున్నారు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించడం వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే అల్లు అర్జున్ కి కొన్ని ప్రశ్నలు వేయగా ఆయన తమదైన శైలిలో సమాధానం చెప్పారు.అల్లు అర్జున్ ఎన్ని టాటూలను వేయించుకున్నారనే ప్రశ్న ఆయనకు ఎదురయింది.
ఈ ప్రశ్నకు అల్లు అర్జున్ సమాధానం చెబుతూ తన శరీరంపై మూడు టాటూలు ఉన్నాయని తెలియజేశారు.
ఇకపోతే ఇప్పుడు మీకు ఒక టాటూ చూపిస్తానని తన ఎడమ చేతి మణికట్టుపై ఉన్నటువంటి ఒక టాటూ చూపించారు.అయితే ఆ టాటూ ఏంటి అనే విషయానికి వస్తే.అల్లు అర్జున్ తన చేతి మణికట్టుపై తన భార్య స్నేహ పేరును రాయించుకున్నారు.
ఈ టాటూ చూయిస్తూ నా భార్య పేరు స్నేహ అంటూ ఆ టాటూని చూపించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.ఇక అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి మనకు తెలిసిందే.ఈమెకు సోషల్ మీడియాలో ఎలాంటి పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే.