Allu Arha :అల్లు అర్హ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత.. ఇంగ్లీష్ అసలు రాదంటూ?

Allu Arha Is A Born Super Star Says Samantha In Shakuntalam Promotions

గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం.కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 Allu Arha Is A Born Super Star Says Samantha In Shakuntalam Promotions-TeluguStop.com

ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే విడుదల తేదీ దగ్గర పడుతున్నడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం సమంత వరుస ఇంటర్వ్యూ లతో బిజీ బిజీగా ఉంది.

Telugu Allu Arha, Kushi, Samantha, Shakuntalam, Tollywood-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత సినిమా గురించి అలాగే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ( Allu arha ) గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.కాగా సినిమాలో శాకుంతలా దేవి, దుష్యంత మహారాజు కొడుకు భరతుడిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగాసమంత మాట్లాడుతూ.

క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశంలో అల్లు అర్హ చాలా బాగా నటించింది అని తెలిపింది సమంత.అల్లు అర్హ చాలా క్యూట్ గా ఉంది.

తనకి ఇంగ్లీష్ అసలు రాదు.పేరెంట్స్ తనని అంత రూటెడ్ గా పెంచారు.

హాయ్ కూడా నార్మల్ గానే చెప్తుంది.

Telugu Allu Arha, Kushi, Samantha, Shakuntalam, Tollywood-Movie

సెట్ లో పెద్ద డైలాగ్ ఇచ్చిన అందరి ముందు భయపడకుండా అల్లు అర్హ బాగానే చెప్పింది.అల్లు అర్హ అసలు తగ్గేదే లే.తను బోర్న్ సూపర్ స్టార్ అంటూ అర్హ ని పొగడ్తలతో ముంచెత్తింది సమంత.ఇకపోతే హీరోయిన్ సమంత సినిమాల విషయానికి వస్తే.గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం శాకుంతలం( Shaakuntalam ) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే బాలీవుడ్ లో ఒక హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది సమంత.

వీటితో పాటుగా మరికొన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube