ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లు అంతా మహిళలే ఉండనున్నారు.
ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సారథ్యంలో సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.ఆస్తి, పెళ్లి రిజిస్ట్రేషన్లు వంటివన్నీ ఇకపై మహిళా ఆఫీసర్లే రిజిస్టర్ చేయనున్నారని తెలుస్తోంది.
ఢిల్లీ సర్కార్ లోని రెవెన్యూ శాఖలో ఉన్న 22 సబ్ రిజిస్ట్రార్స్ పోస్టులలో మహిళలనే రిక్రూట్ చేయనున్నారు.మహిళా అధికారులు ఉన్నత హోదాల్లో ఉండటం వలన అవినీతి, వేధింపులు, రెడ్ టేపిజం ఉండదని స్పష్టం చేశారు.