అక్కినేని అఖిల్( Akkineni Akhil ) నటించిన ఏజెంట్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.ఈ సమ్మర్ లో కచ్చితంగా ఏజెంట్ భారీ విజయాన్ని సొంతం చేసుకొని అఖిల్ కి కమర్షియల్ విజయాన్ని కట్టబెట్టబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెప్పారు.రూ.80 కోట్లకు పైగా ఖర్చు చేసి ఏజెంట్ సినిమాను రూపొందించారు.సినిమా ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే.ఏజెంట్ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయకుండానే షూటింగ్ మొదలు పెట్టామని ఆ కారణంగా సినిమా గందరగోళంగా మారడంతో పాటు బడ్జెట్ భారీగా పెరిగిందని నిర్మాత అనిల్ సుంకర( Producer Anil Sunkara ) షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

చిత్ర యూనిట్ సభ్యుల మధ్య సినిమా విడుదల తర్వాత వివాదాలు తలెత్తాయి అనేది మీడియా సర్కిల్స్ లో జరిగిన ప్రచారం.ఆ విషయం పక్కన పెడితే సాధారణంగా ఏ సినిమా అయినా ఫ్లాప్ అయితే రెండు మూడు వారాల్లోనే ఈ మధ్య డిజిటల్ ప్లాట్ ఫారంపై సందడి చేస్తోంది.కానీ ఏజెంట్ సినిమా( Agent Movie ) ఇన్ని వారాలు అవుతున్నా కూడా ఇంకా స్ట్రీమింగ్ అవ్వడం లేదు.దాంతో అసలు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఆ మధ్యన చిత్ర యూనిట్ సభ్యులు రీ ఎడిట్ చేసిన కొత్త వర్షాన్ని ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నామంటూ పేర్కొన్నారు.సరే ఆ రీ ఎడిట్ పూర్తి అయిన తర్వాత అయినా సినిమాను తీసుకొస్తారా అంటే ఇప్పటి వరకు లేదు.
నిన్న మొన్న సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అంతా భావించారు.

సోనీ లివ్( Sony Liv ) ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు హక్కులు కొనుగోలు చేసింది.కానీ ఇప్పటి వరకు నిర్మాతల నుండి ప్రింట్ రాకపోవడంతో వారు వరుసగా ప్రకటనలు చేసి వాటిని సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఏ సినిమా నిర్మాత మరియు దర్శకులతో ఇంతగా చిక్కులు సమస్యలు ఎదురు కాలేదంటూ సదరు ఓటీటీ వర్గాల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ఇప్పటికైనా వెంటనే డిజిటల్ ప్లాట్ఫారం పైకి ఏజెంట్ ని తీసుకు రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.