వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకున్న అజిత్!

బారత రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ అయిన నేషనల్ కాంగ్రెస్ పార్టీని చీల్చి వెళ్లాడన్న అపప్రధ మూట కట్టుకున్న అజిత్ పవార్( Ajit Pawar ) ఎట్టకేలకు తన కోరికను తీర్చుకున్నారు .రాజకీయ అధికారం కోసం సంవత్సరాలు తరబడి ఎదురుచూసిన అజిత్ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని వినియోగించుకున్నారని చెప్పవచ్చు .

 Ajit Pawar Got The Result For His Effort , Ajit Pawar , National Congress Party-TeluguStop.com

తనతో పాటు 35 మంది ఎమ్మెల్యేల పార్టీ నుంచి చీల్చి తీసుకెళ్లి ఏక్ నాధ్ షిండే ( Eknath Shinde )మరియు బిజెపిల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన అజిత్ పవార్ దానికి తగ్గ ప్రతిఫలాలు అందుకున్నారు .మద్దత్తు ఇచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ శాఖల కేటాయింపు పై మాత్రం ప్రతిష్టoభన కొనసాగింది .

Telugu Ajit Pawar, Eknath Shinde, Maharashtra-Telugu Political News

కీలకమైన శాఖలు ఇవ్వడానికి ఏక్ నాధ్ షిండే వర్గం ఇష్టపడకపోవడంతో హై టెన్షన్ కొనసాగింది అయితే ఎట్టకేలకు బిజెపి రంగంలోకి దిగి శాఖల కేటాయింపు పై ఒక కమిటీని వేసి మరి సమస్యను పరిష్కరించింది .చివరకి అజిత్ ఆర్థిక శాఖమరియు ప్రణాళికలు వంటి కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకోగలిగారు.తనతో పాటు చగన్ భుజబల్ కు ఆహారం పౌరసరఫరాలు ,విపత్తు నిర్వహణ శాఖ అనిల్ పటేల్ కు, ధనుంజయ ముడేకు వ్యవసాయం ,దిలీప్ వాలసే పాటిల్ కి రెవెన్యూ మరియు పశు సంవర్ధక శాఖ , అదితి సునీల్ ఠటకర్ ( Aditi Sunil Tatkare )మహిళా శిశు సంక్షేమ శాఖ దక్కించుకున్నారు .

Telugu Ajit Pawar, Eknath Shinde, Maharashtra-Telugu Political News

ఏది ఏమైనా ఎన్సీపీ ప్రభుత్వంలో తనకు లభించని అధికారాన్ని పార్టీని చీల్చి అయినా దక్కించుకున్న అజిత్ ఇక తనదే అసలైన ఎన్సిపి అని వాదిస్తున్నారు.ఎమ్మెల్యేలు మద్దతు ప్రకారం చూసినా కూడా ఎన్సిపి భవిష్యత్తు అధినేత ఆయనే అని వార్తలు వస్తున్నాయి.అయితే వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉండడం తో మంత్రి యోగం ముచ్చట మున్నాళ్ళు మాత్రమే ఉండే అవకాశం ఉంది .మరి పార్టీ నిమోసం చేశాడన్న అభియోగాలను మోస్తున్న అజిత్ ను వచ్చే ఎన్నికల లో మరఠా ప్రజాలు ఎంత వరకూ ఆదరిస్తారన్నది పెద్ద ప్రశ్న గా మారింది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube