లక్నో నుండి కోల్‌కతాకు బయలు దేరిన ఎయిర్ ఏషియా విమానం ఆదివారం లక్నో విమానాశ్రయంలో పక్షి ఢీకొన్న కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని సమాచారం.ఈ విషయమై విమానాశ్రయ అధికారి ఒకరు మాట్లాడుతూ “ఎయిర్ ఏషియా విమానం పక్షి ఢీకొన్న తర్వాత తిరిగి లక్నో విమానాశ్రయానికి తిరిగి వచ్చింది, విమానం సురక్షితంగా ల్యాండ్ చేయబడింది.అలాగే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారు.” అని తెలిపారు.దాదాపు 170 మంది ప్రయాణికులతో ఎయిర్ ఐసాకు చెందిన ఎయిర్‌బస్ విమానం కోల్‌కతా ఆపరేషన్ కోసం మోహరించింది.
అలాగే ఈ విషయమై ఎయిర్ ఏషియా స్పందిస్తూ… “లక్నో నుండి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఫ్లైట్ i5-319, టేకాఫ్ రోల్ సమయంలో ఓ పక్షి దాడి చేసింది.ఫలితంగా, విమానం తిరిగి బేకి వచ్చింది.తనిఖీ కోసం గ్రౌండింగ్ చేయబడింది.ఇలాంటి అసౌకర్యానికి మేము ప్రయాణికులను క్షమాపణలు కోరుతున్నాము.” అని తెలిపింది.అంతకు ముందు అంటే సరిగ్గా జనవరి 18న, సింగపూర్ నుండి ముంబైకి విస్తారా విమానం తిరిగి చాంగి విమానాశ్రయానికి చేరుకుంది.ఎయిర్‌బస్ A321 విమానం యొక్క ఇంజిన్‌లలో ఒకదానిలో సాంకేతిక లోపం వలన ఇలా జరిగిందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
“ముందు జాగ్రత్త చర్యగా, పైలట్లు వెనక్కి రావాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో చాంగి విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు.” అని విస్తారా ప్రతినిధి ఒకరు ఉటంకించారు.స్థానిక ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ….“ఇక్కడి నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్‌లలో ఒకదానిలో సాంకేతిక లోపం కనిపించిందని, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన సదుపాయాలను అందించడానికి ఎయిర్‌లైన్ భాగస్వామి ఎయిర్‌లైన్స్‌తో కలిసి పనిచేస్తోందని తెలిపారు.”