ఏ హీరోకి అయినా ఫ్యాన్స్ ఏదొక బిరుదు పెడుతూనే ఉంటారు.మన ఇండస్ట్రీలో హీరోలకు మెగాస్టార్.
నరసింహా.కింగ్.
విక్టరీ.సూపర్ స్టార్.
పవర్ స్టార్.రెబల్ స్టార్.
మెగా పవర్ స్టార్.యంగ్ టైగర్.
న్యాచురల్ స్టార్.స్టైలిష్ స్టార్.
ఐకాన్ స్టార్.ఇలా ఎంతో మంది హీరోలకు ఫ్యాన్స్ బిరుదులూ ఇచ్చారు.
అయితే ఎలాంటి బిరుదు లేకుండానే వరుస హిట్స్ కొడుతున్న హీరో మాటేంటి?
అంటే దానికి ఆన్సర్ ఇప్పుడు తెలుసుకోండి. క్షణం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ అంటే అందరికి తెలిసింది.
ఈయన సినిమా అంటే ఏదొక స్పెషల్ కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకులు నమ్మేలా చేసుకున్నారు.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.
ఎప్పటి నుండో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మేజర్ ఒకటి.
ఈ సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ అయినా జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి నిర్మించాడు.
మహేష్ బాబు ఈ సినిమాలో భాగం కావడంతో ముందు నుండి మహేష్ అభిమానులు సైతం ఈ సినిమాపై ద్రుష్టి పెట్టారు. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా రియల్ ఇండియన్ ఆర్మీ హీరో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న మేజర్ సినిమా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ ఇప్పటి నుండే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే అడవి శేష్ ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేసాడు.ఈ ప్రొమోషన్స్ లో పాల్గొన్న ఈయన ఒక ప్రశ్నకు చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఒక ఫ్యాన్ ఈయనకు థ్రిల్లింగ్ స్టార్ అనే బిరుదు ఇవ్వాలని సూచిస్తూ ఇదే ప్రశ్న ఈయనను అడిగాడు.

కానీ ఈయన మాత్రం బిరుదులపై ఏమాత్రం ఆసక్తి లేదట.తనకు బలమైన కథలు కంటెంట్ ఉన్నాయని అందువల్ల హీరోగా ట్యాగ్ లైన్ అవసరం లేదని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.పలువురు తమకు తాము బిరుదులూ ఎంచుకుని ఫ్యాన్స్ ఇచ్చారని చెప్పుకున్నారు.
కానీ ఈయన మాత్రం ఇలా చెప్పడం అందరిని ఆకట్టుకుంది.మరి మేజర్ సినిమా హిట్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.